
ఏలూరుపాడు జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా గాయత్రి నామినేషన్
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన దుంపల గాయత్రి, జనసేన పార్టీ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న తనను గుర్తించి అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ జనసేన నాయకులకు మరియు కనకరాజు సూరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




























