
ఆకివీడు నగర పంచాయతీలో పారిశుద్ధ్యంపై స్థానికుల ఆరోపణలు
ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం పనులు సరిగా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి సమీపంలోనే డ్రైనేజీ అధ్వానంగా ఉందని, కాలువల్లో చెత్త తీసి నెలలైనా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.














