
వర్షపు నీటిలో కాలని వాసుల కష్టాలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెనుమంట్ర మండల కేంద్రం లోని, రాజీవ్ కాలని, లుథరన్ చర్చ్ వెనకాల వీధులు జలమయమయ్యాయి. ముఖ్యంగా రాజీవ్ కాలని లో అయితే పరిస్థితి మరీ దారుణంగా వుంది. మోకాలు లోతు కంటే ఎక్కువ ఉన్న నీటిలో వృద్ధులు, పిల్లలను వివిధ మార్గాల, వివిధ పద్ధతుల్లో ద్వారా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి నీటిని తోడించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు

































