
జిల్లాలో 4.5 లక్షల మందితో యోగా రిజిస్ట్రేషన్ల లక్ష్యం: కలెక్టర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. వీరవాసరం, భీమవరం మండలాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ ప్రాంగణాలు, ఆలయాలు, విద్యాసంస్థల్లో యోగా వేడుకలు జరుగుతున్నాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో మొత్తం 4.5 లక్షల మందితో యోగా రిజిస్ట్రేషన్లు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె పేర్కొన్నారు.














