
పాఠశాలకు పర్నిచర్ అందించిన రోటరీ క్లబ్
భీమవరం మౌలానా అబ్దుల్ కలామ్ మున్సిపల్ ప్రాధమిక పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 35 వేలు విలువ కలిగిన ఫర్నిచర్ (టేబుల్స్, కుర్చీలు) ను అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనందించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ భీమవరం ఫర్నిచర్ ను అందించామని క్లబ్ అధ్యక్షులు గిరి అన్నారు. క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.





































