
గురవాయిగూడెం ఆలయంలో మహా చండీ హోమం, అన్నదానం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజు శ్రీ మహా చండీ దేవి అలంకరణ సందర్భంగా మహా చండీ హోమం గురువారం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దల్లి గోపి నాగ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ హోమంలో మాల ధరించిన భవానీలు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో భారీ ఎత్తున అన్న సమారాధన కూడా జరిగింది.




































