
పరివర్తన దివ్యాంగుల పాఠశాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఏలూరులోని పరివర్తన దివ్యాంగుల పాఠశాలలో మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ అంబికా రాజా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ సత్యం, అహింస, శాంతి మార్గాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అలాగే AI సాంకేతికతను బాధ్యతాయుతంగా, మంచి పనుల కోసం ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి. శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.





















