Sep 07, 2026, 17:09 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ప్రభుత్వ ఐటీఐలో 16న జాబ్ మేళా
Sep 07, 2026, 17:09 IST
ఆదిలాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 16న ప్రభుత్వ ఐటీఐలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో పలు ప్రైవేట్ కంపెనీల్లో మొత్తం 57 ఖాళీలు భర్తీ చేయబడతాయి. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల, 8వ తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి మిల్కాసోమవారం తెలిపారు.