ఏలూరు - Eluru

పేదల ఇళ్ల పట్టాల కోసం ఏలూరు ఎమ్మెల్యేకు వినతి

పేదల ఇళ్ల పట్టాల కోసం ఏలూరు ఎమ్మెల్యేకు వినతి

ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటిని ఆర్.సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పి. కిషోర్ శనివారం కలిసి పేదలు నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు ఇప్పించాలని వినతి పత్రం అందించారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో 20 సంవత్సరాలుగా కుమ్మరి రేవు, ASR కాలనీ, సుందరయ్య కాలనీ, NTR కాలనీ, అన్నే నగర్, మాదేపల్లి ప్రాంతాల్లో సుమారు 5 వేల మంది పేదలు ఇళ్లు వేసుకుని నివసిస్తున్నారని కిషోర్ తెలిపారు. ప్రభుత్వం పట్టాలు ఇస్తున్నందున ఏలూరులోనైనా పేదల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై ఎమ్మెల్యే చంటి, పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా