
అక్షరాస్యత ప్రాముఖ్యతను చాటిచెప్పిన విద్యార్థులు
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం దుద్దుకూరు జడ్పీ హైస్కూల్లో సోమవారం విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం పి. వీర్రాజు ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి “WORLD LITERACY DAY” అక్షరాలను రూపొందించి అక్షరాస్యత ప్రాముఖ్యతను చాటిచెప్పారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అని, సమాజ అభివృద్ధికి అక్షరాస్యత ఎంతో కీలకమని ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనను ఉపాధ్యాయులు అభినందించారు.





































