Oct 06, 2026, 05:10 IST/
ఇండిగో టికెట్ ధరల పెంపు.. ప్రయాణికులపై భారం
Oct 06, 2026, 05:10 IST
విమాన ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, దేశీయ విమానయాన సంస్థ ఇండిగో టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో ప్రయాణికులపై ఏడాదికి రూ.2000 కోట్ల నుంచి రూ.2500 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. దేశీయంగా 500 కి.మీ. వరకు రూ.375 నుంచి 2000 కి.మీ. కంటే ఎక్కువ దూరానికి రూ.1300 వరకు సర్ ఛార్జీలు పెరగనున్నాయి. అంతర్జాతీయ సర్వీసులపై కూడా ధరలు పెరగనున్నాయి. ఏప్రిల్లో టికెట్ ధరలు పెంచిన ఆరు నెలలకే ఈ పెంపు అమలులోకి వస్తోంది.