Sep 24, 2026, 04:09 IST/
బ్యాంకుల సమ్మె.. రేపే అకౌంట్లలోకి జీతాలు, పెన్షన్లు
Sep 24, 2026, 04:09 IST
బ్యాంకుల సమ్మె నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ డబ్బులను సెప్టెంబర్ 25న (రేపు) ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ విభాగాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ మొత్తాన్ని 'అడ్వాన్స్ పేమెంట్'గా పరిగణిస్తారు. లెక్కలు ఖరారైన తర్వాత అక్టోబర్ చెల్లింపులో మిగిలిన డబ్బులను సర్దుబాటు చేస్తారు. ఈ సమ్మె సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగనుంది.