Oct 16, 2026, 03:10 IST/ఆసిఫాబాద్
ఆసిఫాబాద్
చింతలమానేపల్లిలో గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్టు
Oct 16, 2026, 03:10 IST
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లికి గంజాయి రవాణా అవుతోందన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు గురువారం గూడెం నుంచి వచ్చే దారిలో మాటువేసి, ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల గంజాయిని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో గంగాపూర్కు చెందిన పాగిడి ప్రసాద్, సిర్పూర్(టి)కి చెందిన గాజిరెడ్డి సంతోష్, గొల్ల సంతోష్ ఉన్నారు. వీరు మహారాష్ట్రలోని ఒక వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తెస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురితో పాటు గంజాయి విక్రయించిన వ్యక్తిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్ఐ కమలాకర్ తెలిపారు.