Sep 21, 2026, 01:09 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
దాబా బి బొజ్జుగూడలో ఘనంగా గణేష్ నిమజ్జనం వేడుకలు
Sep 21, 2026, 01:09 IST
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని దాబా బి బొజ్జగూడ గ్రామంలో ఆదివారం గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ఆదివాసీ గణేష్ మండపం వద్ద గూడా పటేల్, సర్పంచ్ నర్వటే ఈశ్వర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా డోల్, తుడుం వాయిద్యాలతో గణనాథుడి నిమజ్జనం జరిగింది. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.