
శ్రీ వైకుంఠ నారాయణడిగా శ్రీభూసమేత వైభవ వెంకటేశ్వరస్వామి వారు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి శనివారం సందర్భంగా సుప్రభాత సేవ అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో భక్తులు చే ప్రత్యేక పూజలు జరిగినవి. అనంతరం స్వామివారిని వైకుంఠ నారాయణుడిగా ఎంతో అద్భుతంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం భక్తుల సౌజన్యంతో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేసినారు.








































