
ఓజోన్ పరిరక్షణపై విద్యార్థి అద్భుత మైక్రో ఆర్ట్
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పేపర్ గ్రామానికి చెందిన విద్యార్థి కే నాగ సూర్య రాఘవేంద్ర బాబు, ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సూక్ష్మ కళ (మైక్రో ఆర్ట్) చేశారు. సూర్యుడి నుండి మనల్ని కాపాడే ఓజోన్ పొర ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడమే దీని లక్ష్యమని తెలిపారు. ఈ కళాకృతి ద్వారా ఓజోన్ పరిరక్షణ ఆవశ్యకతను చాటిచెప్పారు.

































