
నరసాపురంలో శరన్నవరాత్రి ఉత్సవాలు: భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వై.ఎన్. కాలేజీ రోడ్డులోని ఆర్యవైశ్య రామాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం నాలుగో రోజు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పెద్దలు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.































