పోలవరం(ప.గో) - Polavaram

రూ 2.50 కోట్లతో బి.టి. రోడ్డు మంజూరు చేయడం పట్ల హర్షం

రూ 2.50 కోట్లతో బి.టి. రోడ్డు మంజూరు చేయడం పట్ల హర్షం

మధ్యాహ్నపు వారిగూడెం నుండి సాలిగూడెం వరకు ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రూ. 2. 50 కోట్ల అంచనా వ్యయంతో బి. టి. (BT) రోడ్డును మంజూరు చేయడం పట్ల రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపిన ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులుకి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి,  ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి నియోజకవర్గ ప్రజల తరఫున, తెలుగు యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా
విదేశీ బొగ్గు దిగుమతిలో రూ.3 వేల కోట్ల స్కాం: KTR
Oct 15, 2026, 11:10 IST/

విదేశీ బొగ్గు దిగుమతిలో రూ.3 వేల కోట్ల స్కాం: KTR

Oct 15, 2026, 11:10 IST
TG: సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బహిరంగ లేఖ రాశారు. రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్‌ ఆపాలని డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో భారీ స్కామ్‌ జరుగుతోందని ఆరోపించారు. 'భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద కంపెనీతో ముందే CM చీకటి ఒప్పందం. కృత్రిమ బొగ్గు కొరత సృష్టించి కంపెనీని రేవంత్‌రెడ్డి రంగంలోకి దింపారు. భోత్రా లాజిస్టిక్స్‌తో ప్రభుత్వం, సింగరేణి ఒప్పందం బయటపెట్టాలి. మొత్తం కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలపై చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు' అని అన్నారు.