
మానవత శాఖ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహణ
పెంటపాడులో మానవత శాఖ ఆధ్వర్యంలో మానవత సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవత పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మానవతా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్, పాల్, వినాయకుడు, సత్యనారాయణ, వీరస్వామి, జయరాజు, ప్రభాకర రెడ్డి, లీలా కృష్ణరెడ్డి, సూర్యనారాయణ, ప్రసాద్, శ్రీనివాస్ కుమార్, శ్రీనివాస్, నారాయణరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.






































