Sep 15, 2026, 17:09 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
భారీ గణనాథుడిని దర్శించుకున్న ఆదిలాబాద్ కలెక్టర్
Sep 15, 2026, 17:09 IST
ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా గణేష్ మండలి వారు ప్రతిష్టించిన 52 అడుగుల భారీ వినాయకునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గణనాథుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, నిర్వాహకులు తోట పరమేశ్వర్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు.