
బానోతురాజును సత్కరించిన ఉంగుటూరు ఉపాధ్యాయ బృందం
బొమ్మిడి నెంబర్ వన్ పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్న బానోతు రాజుని మండల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా సన్మానించడం జరిగినది. వారి ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకిత భావం ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చినందుకు గాను మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన శుభసందర్భంలో మండల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఉపాధ్యాయులు పాల్గొని అభినందించారు.




























