AP: డిప్యూటీ సీఎం,
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. పవన్ కళ్యాణ్ చేపడుతున్న సంస్కరణలను రాధాకృష్ణ అభినందించారు. వీరిద్దరి మధ్య స్నేహం, గతంలో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు వంగవీటి త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.