ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఒక్క పులివెందులలోనే గొడవలు జరగడానికి కారణమేంటని ప్రశ్నించారు. గతంలో అక్కడ ప్రతి వార్డూ ఏకగ్రీవమయ్యేదని, ప్రస్తుతం
ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించింది వైఎస్ జగనేనని, గొడవలకు ఆయనే కారణమని విమర్శించారు.
టీడీపీ నేతల వాహనాలను
వైసీపీ కార్యకర్తలు తగలబెట్టారని ఆరోపించారు.