AP: జిల్లా అభివృద్దికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని జెడ్పీ ఛైర్పర్సన్ మజ్జి సిరిసహస్ర అన్నారు. అతి చిన్న వయసులోనే తనకు ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ ప్రజాప్రతినిధుల సలహాలను స్వీకరించి, ప్రజలకు మంచి పరిపాలనను అందించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.