AP:
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించడం దుర్మార్గమని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ అనంతరం వెంగళాయపాలెం నుంచి నాగార్జున యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాల్సిన బ్యాలెట్ బాక్సులను నల్లపాడు వద్ద ఎందుకు దించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని నిలదీసిన వారిపై లాఠీఛార్జ్ చేసి, కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం కేసులు పెట్టడం ఏమిటని.. అలాంటి కేసు కూడా పెడతారా? అని నిలదీశారు.