వార్తలు రాసినందుకు దాడులు చేస్తారా?: జూపూడి

8565చూసినవారు
వార్తలు రాసినందుకు దాడులు చేస్తారా?: జూపూడి
సాక్షి మీడియా కార్యాలయంపై జరిగిన దాడిని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై వార్తలు ప్రచురించినందుకే అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే, అదే పోలీసులను పంపి కార్యాలయంపై దాడి చేయించడం హేయమైన చర్య అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాలరాస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్