లోకేష్ ఎదుగుదలకు వైసీపీ బ్రేకులు వేస్తుందా?

5చూసినవారు
లోకేష్ ఎదుగుదలకు వైసీపీ బ్రేకులు వేస్తుందా?
కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్‌ ప్రాధాన్యం పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగా డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న పోరాటాన్ని ఇందులో భాగంగానే కొందరు అభివర్ణిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద లోకేశ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయడం, కూటమి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ప్రస్తావించడం, సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయడం వంటి అంశాల ద్వారా రాజకీయంగా ఒత్తిడి పెంచాలని వైసీపీ భావిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్