AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి తీరం దాటనుందని APSDMA హెచ్చరించింది. ఈ సమయంలో గాలులు గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా, మంగళ, బుధవారాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాను ప్రభావం ఉన్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.