మహిళపై ఇంటి యజమాని దాడి (వీడియో)

16చూసినవారు
AP: తిరుపతిలోని బొమ్మగుంట ప్రాంతంలో ఈ నెల 27న అమానుష ఘటన చోటుచేసుకుంది. రాజేశ్వరి అనే మహిళ తన భర్తతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అయితే, ఇల్లు ఖాళీ చేయాలని వారిపై ఇంటి ఓనర్ ఆనంద్ ఒత్తిడి చేస్తున్నారు. వారు ఒప్పుకోకపోవడంతో ఆనంద్ దారుణానికి ఒడిగట్టాడు. రాజేశ్వరి భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై దాడి చేశాడు. రాజేశ్వరిని జుట్టు పట్టుకొని.. రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్