ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి

13చూసినవారు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. మహిళ మృతి
AP: కృష్ణా జిల్లా, పామర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో జగ్గయ్యపేటకు చెందిన తిరుపతమ్మ (60) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి బంధువులకు సమాచారం అందించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్