AP: నంద్యాల జిల్లా శ్రీశైలంలో
టీడీపీ నేతలు రెచ్చిపోయారు.
వైసీపీ నేత పుల్లయ్యపై
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు అర్ధరాత్రి కర్రలతో దాడి చేశారు. బాధితుడిని దేవస్థానం వైద్యశాలలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. ఎమ్మెల్యే అనుచరులు మణికంఠ, శివ, మనోజ్, కాశయ్యతోపాటు మరో 10 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టారని పుల్లయ్య తెలిపారు.