AP: వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ (
వైసీపీ) ప్రతినిధి బృందం గురువారం మరోసారి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) అధికారులను కలవనున్నారు. పలు రాజకీయ అంశాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎస్ఈసీకి అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమయ్యారు. ఇప్పటికే అనేకమార్లు ఎన్నికల కమిషన్ను ఆశ్రయించిన
వైసీపీ నేతలు, తాజా ఫిర్యాదులో ఎటువంటి అంశాలను లేవనెత్తుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ఇతర రాజకీయ ఆరోపణలపై వారు తమ వాదనను బలంగా వినిపించనున్నట్లు సమాచారం.