AP: తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పట్టాభిరామిరెడ్డిని
టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. రేపు జరగనున్న ఎంపీపీ పరోక్ష ఎన్నికల్లో మెజారిటీ కోసం
టీడీపీ కుట్రలకు పాల్పడుతోందని సమాచారం. కేవీబీపురం మండలంలో
టీడీపీ, వైఎస్సార్సీపీకి చెరో ఆరు ఎంపీటీసీ స్థానాలు రాగా, అధికారం దక్కించుకునేందుకు ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో కూడా కౌంటింగ్ సమయంలో
టీడీపీ కుట్రలు చేసిందని పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.