AP: రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభంజనం వీచినా, అల్లూరి జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల్లో మాత్రం
వైసీపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. మొత్తం 11 జడ్పీటీసీ స్థానాల్లో
వైసీపీ 7 స్థానాలను కైవసం చేసుకుని జడ్పీ పీఠాన్ని సొంతం చేసుకుంది. కూటమి 3, సీపీఐ(ఎం) 1 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా
వైసీపీ 85 స్థానాలతో ముందంజలో ఉండగా, కూటమి 57 స్థానాలకు పరిమితమైంది. సీట్ల సర్దుబాటులో విభేదాలు, అంతర్గత కుమ్ములాటల వల్లే కూటమి ఓటమి పాలైందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.