స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్?

6417చూసినవారు
స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్?
AP: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. అక్టోబర్ 1వ తేదీన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జగన్ భేటీ కానున్నారు. స్థానిక ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ శ్రేణులకు జగన్ ఆదేశించారు. కూటమికి ధీటుగా బలమైన అభ్యర్థులను దించాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్