AP: స్థానిక సంస్థల
ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడమే
వైసీపీ పని అని
టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేస్తూ, పుంగనూరు సహా పలుచోట్ల
వైసీపీ శ్రేణులే విధ్వంసాలకు పాల్పడి ఆ నెపాన్ని టీడీపీపై నెడుతున్నారని మండిపడ్డారు. 2021లో
వైసీపీ హయాంలో జరిగిన ఎన్నికల్లో దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలతో బెదిరించి అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.