గణపవరంలో YCP సర్పంచ్ అభ్యర్థి విజయం

33చూసినవారు
గణపవరంలో YCP సర్పంచ్ అభ్యర్థి విజయం
AP: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనత్త సొంత గ్రామమైన మైలవరం మండలం గణపవరంలో వైఎస్సార్సీపీ తన పట్టును నిలుపుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన మానస రెడ్డి తన ప్రత్యర్థిపై 275 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విమలమ్మ కుమారుడు యువరాజు రెడ్డి వ్యూహాలు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. మొత్తం 12 వార్డులకు గాను వైఎస్సార్సీపీ ఎనిమిది స్థానాల్లో, టీడీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించినప్పటికీ, ఇప్పుడు సర్పంచ్ పదవిని కైవసం చేసుకోవడం విశేషం.

సంబంధిత పోస్ట్