పులివెందులలో సైలెంట్ అయిన వైసీపీ?

18చూసినవారు
పులివెందులలో సైలెంట్ అయిన వైసీపీ?
AP: ఒకప్పుడు వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలకు వేదికైన పులివెందులలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైసీపీ నేతలు మౌనం వహించడం లేదా పార్టీలు మారడంతో ఆ పార్టీ బలహీనపడింది. ఈ నేపథ్యంలో, టీడీపీ ప్రధాన శక్తిగా ఎదగడంతో ఆ పార్టీలోని వేర్వేరు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం తీవ్రమైంది. సన్మానం వివాదంతో మొదలైన ఈ ఘర్షణ, వినాయక మండపం వద్ద విజయ్ కుమార్ రెడ్డి, పుష్పనాథ్ రెడ్డి వర్గాల మధ్య వాహనాల ధ్వంసం, ఇంటిపై దాడులు, తుపాకీ కాల్పుల వరకు చేరింది. ప్రత్యర్థుల ఉనికి కష్టమనుకునే చోట వైసీపీ పరిస్థితి ఇలా మారడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

సంబంధిత పోస్ట్