గన్నవరం జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైసీపీ.

34చూసినవారు
గన్నవరం జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న వైసీపీ.
AP: కృష్ణా జిల్లా, గన్నవరం జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. సుదీర్ఘంగా సాగిన 5 గంటల హైడ్రామా అనంతరం అధికారులు వైసీపీ అభ్యర్థి అనగాని రవిని విజేతగా ప్రకటించారు. కూటమి తరపున నిలబడిన బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామిపై 63 ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారని అధికారికంగా వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సమయంలో జరిగిన పరిణామాలు గన్నవరం నియోజకవర్గంలో ఆసక్తిని రేకెత్తించాయి.

సంబంధిత పోస్ట్