AP: ప్రకాశం జిల్లా, లింగసముద్రం పరిధిలో ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేసిన ఘటన చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఆ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె కందుకూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.