AP: ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు ఎంపీటీసీ స్థానంలో కాకి వినోదిని 1,081 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అతి పిన్న వయసులోనే ఎంపీటీసీగా గెలుపొందిన యువతిగా గుర్తింపు పొందారు. బీఏ పొలిటికల్ సైన్స్ చదివిన వినోదిని.. చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ విజయాన్ని అందుకున్నారు.