అభ్యర్థుల ఎంపికపై YS జగన్ కసరత్తు?

5చూసినవారు
అభ్యర్థుల ఎంపికపై YS జగన్ కసరత్తు?
AP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, అభ్యర్థుల ఎంపికపై YCP అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. OC, BC, SC, ST రిజర్వేషన్ల అమలుకు అనుగుణంగా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారా లేదా అని ఆరా తీసినట్లు సమాచారం. వార్డులు, MPTC, ZPTC అభ్యర్థుల వివరాలతో పాటు మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్