AP: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు జాతీయ మీడియా సంస్థ ‘IANS’ వెల్లడించింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది జూలై 8 నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. 2027 నుంచి పాదయాత్ర చేస్తానని
జగన్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించినప్పటికీ, నిర్దిష్ట తేదీ ప్రచారంలోకి రావడం ఇదే తొలిసారి. గతంలో 2017లో చేసిన పాదయాత్రతోనే
వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.