AP: వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు లోకభవన్లో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో
వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని మరియు అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని
జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే ఈ అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)కు ఫిర్యాదు చేసిన
జగన్, ఇప్పుడు గవర్నర్ జోక్యాన్ని కోరుతూ ఈ భేటీకి సిద్ధమయ్యారు.