AP: గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఆదివారం కలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా
వైసీపీ నేతలపై జరుగుతున్న దాడుల అంశంపై గవర్నర్కు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి, గురుమూర్తిపై జరిగిన దాడులు, రాయచోటిలో
వైసీపీ కార్యాలయం దగ్ధం, పులివెందులలో కాల్పుల ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు
జగన్ సిద్ధమవుతున్నారు. శాంతిభద్రతల వైఫల్యంపై గవర్నర్కు పూర్తిస్థాయిలో వివరించనున్నారు.