AP: ఒంగోలులో మంగళవారం నాడు మాజీ సీఎం YS జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. ఒంగోలు క్లౌ పేటలోని వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ దివంగత కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజశేఖర్ మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన జగన్, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీకి రాజశేఖర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.