AP: ఢిల్లీలో
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె పెళ్లికి రాహుల్ గాంధీని ఆహ్వానించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా హింస జరిగిందని ఆమె ఆరోపించారు.