బెంగళూరులో ఘనంగా వైఎస్ షర్మిల కూతురి పెళ్లి

39చూసినవారు
బెంగళూరులో ఘనంగా వైఎస్ షర్మిల కూతురి పెళ్లి
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ దంపతుల కుమార్తె వైఎస్‌ అంజలిరెడ్డి, సామల రఘురామరెడ్డిల వివాహం బుధవారం బెంగళూరు నగరంలోని ఒక రిసార్టులో ఘనంగా జరిగింది. క్రైస్తవ సంప్రదాయ పద్ధతులలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత ఆప్తులు మరియు సమీప బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. కాగా, ఈ వివాహ వేడుకకు మేనమామ అయిన జగన్‌ గైర్హాజరు కావడంతో, దీనిపై రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్