బద్వేల్ - Badvel

మున్సిపల్ చైర్మన్ రేసులో బీసీ నేత పేరు తెరపైకి

మున్సిపల్ చైర్మన్ రేసులో బీసీ నేత పేరు తెరపైకి

వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌లో మున్సిపల్ చైర్మన్ పదవి రేసులో మరో బీసీ నేత పేరు ఆదివారం తెరపైకి వచ్చింది. చిన్నకేశంపల్లె మాజీ సర్పంచ్ ఉప్పుటూరి వెంకట రమణయ్య యాదవ్ పేరును చైర్మన్ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇన్చార్జి సూర్యనారాయణ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు పొందారు. సౌమ్య స్వభావం, అందరితో సత్సంబంధాలు కలిగిన వెంకట రమణయ్య యాదవ్‌కు టికెట్ దక్కుతుందా అనే దానిపై బద్వేల్ టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా
Oct 11, 2026, 14:10 IST/

కామ్రేడ్ కల్యాణ్ షూటింగ్‌లో ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న నటుడు

Oct 11, 2026, 14:10 IST
‘కామ్రేడ్ కల్యాణ్’ సినిమా షూటింగ్‌లో సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2025 ఫిబ్రవరిలో మంగళూరు అడవుల్లో ఎత్తైన వంతెనపై యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా అదుపుతప్పి కింద పడబోయారు. వెంటనే స్పందించిన హీరో శ్రీ విష్ణు, కోన వెంకట్, దర్శకుడు జానకీరామ్ మారెళ్ల, సిబ్బంది ఆయనను పట్టుకుని పైకి లాగారు. ఈ మేకింగ్ వీడియోను శ్రీకాంత్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఇది తనకు పునర్జన్మ లాంటిదని పేర్కొన్నారు. అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది.