
తెలుగు సాహిత్య దిగ్గజం విశ్వనాథ సత్యనారాయణకు ఘన నివాళి
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమం ఉపాధ్యాయ సేవా కేంద్రంలోఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆడిటర్ సాధు గోపాలకృష్ణ, కవి మరియు న్యాయవాది సి. వి. సురేష్ పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వనాథ తన అద్భుతమైన రచనలతో తెలుగు సాహిత్యానికి అందించిన విశేష సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్‌రెడ్డి, టి. డి. వరుణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



































